ఎదులాపురం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒకరూ సమాన ఫలాలు అందుకోగలుగుతున్నామని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్135వ జయంతిని స్థానిక అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి రామన్న పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలాల్ అజయ్, ఇజ్జగిరి నారాయణ, యూనిస్ అక్బాని, గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, అత్రం వెంకటేశ్, సలీమ్, సేవ్వా జగదీష్, దమ్మాపాల్, అనీల్, బట్టు సతీష్, స్వరూపరాణి, కరుణ పాల్గొన్నారు.
బోథ్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ అడుగుజాడల్లో నడుద్దామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పొచ్చెర, బోథ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు ఏనుగు రేఖ, కుర్మే అన్నపూర్ణ, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, దివాకర్‌రెడ్డి, కుడాల స్వామి, ఆడె గజేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.