అవకాశాలను అందిపుచ్చుకోవాలి
అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ సూచించారు.
- ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్పీ శ్రీజ
ఎదులాపురం, ఫిబ్రవరి16: అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ సూచించారు. టెలికాం ఇండస్ట్రీలోని పలు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో గురువారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. జాబ్ మేళాకు యువత నుంచి స్పందన లభించింది. ఆయా కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన వేతనాన్ని చెల్లించనున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడారు. టెలికాం ఇండస్ట్రీలో అవసరమైన ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగంతో పాటు ఉచితంగా వసతి కూడా కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనుల పరిశీలన
తలమడుగు, ఫిబ్రవరి 16 : మండలంలోని రుయ్యాడిలో చేపట్టిన ఉపాధిహామీ పనులను ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ గురువారం పరిశీలించారు. కూలీలకు సంబంధించిన పలు రికార్డులను చూశారు. మండలంలో 28 జీపీల్లో జరుగుతున్న పనుల వివరాలను ఉపాధిహామీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి పనులు గుర్తించి చేస్తున్నారో తెలుసుకున్నారు. ఆమె వెంట సర్పంచ్ పోతారెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఉపాధి హామీ ఏపీవో మేఘమాల ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

