ఓటేయకుండా.. ఓటింగ్ పెంచారా..!?
ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్‌లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వచ్చేలా ఎక్కడా రాయలేదు. ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఓటు ద్వారా ఎన్నికైనా ఎమ్మెల్యే ఓటేయకపోవడం ఏమిటని..
- ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే స్థాయిని తగ్గించిన కాంగ్రెస్ నాయకులు
- ‘నమస్తే కథనం’తో ఆగమాగంlప్రచురితమైన వారానికి ఖండనేమిటో మరి..
- ఉన్నమాటంటే ఉలికిపాటెందుకంటున్న ప్రజలు
బెల్లంపల్లి, మే 23 : ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్‌లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వచ్చేలా ఎక్కడా రాయలేదు. ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఓటు ద్వారా ఎన్నికైనా ఎమ్మెల్యే ఓటేయకపోవడం ఏమిటని.. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా అని జనం చర్చించుకుంటున్న విషయాలనే ఆ కథనంలో ప్రచురించాం.
ఇక ఆయన స్థానికంగా అందుబాటులో ఉండరంటూ రాసిన ప్రతి వ్యాఖ్యం బెల్లంపల్లి ప్రజానీకం మనసులో నుంచి బయటికి వచ్చినవే తప్ప.. ఎక్కడా కూడా ఎమ్మెల్యే గౌరవాన్ని భంగపరిచే ప్రయత్నం చేయలేదు. దీనిపై కొందరు బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేపై దురుసుగా మాట్లాడినా, అసభ్యకరంగా రాసినా ఊరుకోమంటూ చెప్పారు. అసలు ఆ మొత్తం వార్తలో అసభ్యకరమైన పదజాలం ఎక్కడైనా ఉందా అంటే అదీ లేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పిన మాటలకు.. ప్రస్తుతం చేస్తున్న దానికి పొంతన లేదనేది జగమెరిగిన సత్యం.
అది దాస్తే దాగేది కాదు. జనంలో ఈ అభిప్రాయాన్ని మాత్రమే నమస్తే ప్రచురించింది. ఆ వార్తను పూర్తిగా చదివారో.. లేదో కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం వార్త వచ్చిన వారానికి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఖండించడం శోచనీయంగా మారింది. వార్త వచ్చిన వారం రోజులకు ఖండన ఏమిటనేది అర్థం కాలేదు. పైగా ఎమ్మెల్యే ఓటు వేయలేదు కానీ.. ఆయనే 15 శాతం ఓటింగ్ పెంచారంటూ సదరు నాయకులు మాట్లాడి.. ఎమ్మెల్యే స్థాయిని వాళ్లే తగ్గించారు. మా ఎమ్మెల్యే ఓటు వేయలేదంటూ ఆ పార్టీ నాయకులే చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సమస్యలకు, ప్రజా అభిప్రాయాలకు అద్దం పడుతున్న కథనాలు ప్రచురిస్తున్న పత్రికపై అక్కసు ఎందుకని, జనంలో ఉన్నదే ఆ పత్రికోళ్లు రాశారని బెల్లంపల్లి ప్రజలే చెబుతున్నారు. 2018లో ఏనుగు గుర్తుపై పోటీ చేసినప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎక్కడ ఓటేశారు.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఓటు వేశారు.. ఎంపీ ఎన్నికల్లో ఎక్కడ ఓటు వేశారు.. దీనికి సంబంధించి ఆధారాలుంటే చూపించాలంటూ బెల్లంపల్లి జనం గుసగుసలాడుకుంటున్నారు. ఓటేయకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓ ఎమ్మెల్యే తీరుపై పత్రికల్లో వార్తలు వస్తే ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారో చెప్పాలంటున్నారు. ఉన్నమాటంటే ఉలికిపాటెందుకని, ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు నాయకులు నడుచుకోవాలని జనం కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

