నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు.
తాండూర్, నవంబర్ 8 : నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పై శిక్షణ నిర్వహించారు.
ఈ శిక్షణలో సెర్చ్ సీనియర్ సీఆర్పీలు మండల పరిధిలోని గ్రామ సంఘాల ఆఫీస్ బేరర్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పురుషోత్తం నాయక్ హాజరై మాట్లాడుతూ శిక్షణలో అందరికీ విద్యా ప్రాధాన్యం, వయోజన విద్య వల్ల కలిగే ప్రయోజనాలు, నిరక్షరాస్యతతో కలిగే సమస్యలు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలపై శిక్షణ, వయోజన విద్యా ప్రాముఖ్యతను వివరించారు. తాండూరు మండలంలో 1823 నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించుట కొరకు 176 మంది వాలంటీర్ టీచర్స్ ను గుర్తించి ఉల్లాస్ అప్ లో నమోదు చేయడం జరిగిందని, నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా చేసే ఈ కార్యక్రమం. విజయవంతం చేసి జిల్లాను ప్రధమ స్థానంలో నిలబెట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, వయోజన విద్యశాఖ డిఆర్పీ సుమన్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళ, కోశాధికారి రాజ్యలక్ష్మి, సెర్ఫ్ నుంచి వచ్చిన సీఆర్పీలు తిరుమల, అమీనా, తాండూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఓబీ లు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

