నిర్మల్ టౌన్/సోన్, అక్టోబర్ 4 : ‘ప్రజల కోసం ఆనాటి భగీరథుడు పైనున్న నీళ్లను కిందికి తీసుకొస్తే.. ఈనాటి అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ కింద నీళ్లను పైకి తెచ్చి కాళేశ్వరం నీటితో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్రీ యూనిక్ కంపెనీ ఆధ్వర్యంలో సోన్ మం డలం పోచంపాడ్ గ్రామ శివారులో రూ. 300 కోట్లతో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి అల్లోలతో కలి సి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు.
మధ్యా హ్నం 12 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా వీక్షించిన మంత్రి కేటీఆర్.. ప్రాజెక్టు సముద్రంగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై గతం లో మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తే నీరు రాక ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జి ల్లాల రైతులు కాకతీయ కాలువలపై నిద్రాహారాలు మా ని కోట్లాటలకు దిగిన మాట వా స్తవం కాదా అని రైతులను అడిగారు. సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్‌కు సజీవ జలకళ అందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం నీటిని ఎ గువకు ఎత్తిపోస్తూ ప్రాజెక్టుకు మళ్లించే కార్యక్రమం చేపట్టారన్నారు. రూ.714 కోట్లతో ప్యాకేజీ-27 ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని భరోసానిచ్చారు. కాంగ్రెస్ హయాంలో కాలువలపై మోటర్లు పెడితే కరెంటోళ్లు తీసుకెళ్లేవారని, తీగలను కట్చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు నిరంతర కరెంటు, ప్రాజెక్టుల ఆధునీకరణతో రాష్ట్రం సస్యశ్యామలమైందన్నారు.
దేశంలో అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకునే నిత్యావసర వస్తువుల్లో వంట నూనె ప్రధానమైందని, మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితికి కేంద్ర విధానమే కారణమని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దీని వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని తెలంగాణ సర్కారు ఆయిల్‌పా మ్ సాగుపై ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. ఇం దు లో భాగంగా నిర్మల్‌లో రూ.300 కోట్లతో ఆయిల్‌పా మ్ ఫ్యాక్లరీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణం పూర్తయి తే నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్ జి ల్లాల్లోని ఆయిల్ పామ్ రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. రెండేండ్లలో ఫ్యాక్టరీని పూర్తి చేసి, వె య్యి మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, ప్రజల మధ్య ఉంటున్న ఇంద్రకరణ్‌రెడ్డిని గెలిపించడం వల్లే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి, జాన్సన్ నాయక్‌ను గెలిపించి, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు.
ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారికి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ రూ.300 కోట్లతో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. మొసళ్ల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులతో ప్ర త్యేక సమావేశం నిర్వహించారు. డీఎస్పీ గంగారెడ్డి ఆ ధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంత్‌రావు, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబు, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌జాదవ్, రైతు బంధు సమితి కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, సోన్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధ్యక్షుడు గంగారెడ్డి, ఆయిల్ఫామ్ నిర్వాహకులు మోహన్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావురాథోడ్, డీఆర్డీవో విజయలక్ష్మి, సర్పంచ్ మమత, గంగారెడ్డి పాల్గొన్నారు.