సామాజిక సేవే.. కోనప్ప ప్రాణం
అర్ధాకలితో ఇంటికొస్తే కడుపునిండా అన్నం పెడతాడు. ఏ అర్ధరాత్రయినా ఆపదలో ఫోన్ చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమస్య తీరుస్తాడు. నిరుద్యోగ యువతకు భోజన సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు.
- కార్మికుడి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం
- సిర్పూర్ దశ-దిశను మార్చిన సేవాతత్పరుడు
- నిత్యాన్నదానం ద్వారా రోజుకు 2 వేల మందికి భోజనం
- ప్రచారంలో దూసుకుపోతూ.. నాలుగోసారి బరిలో..
- కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : అర్ధాకలితో ఇంటికొస్తే కడుపునిండా అన్నం పెడతాడు. ఏ అర్ధరాత్రయినా ఆపదలో ఫోన్ చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమస్య తీరుస్తాడు. నిరుద్యోగ యువతకు భోజన సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. కళాశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం పెడతాడు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. దాదాపు 1000 మంది పేదింటి ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు జరిపించాడు.
కాగజ్‌నగర్ కేంద్రంగా నిత్యాన్నదాన సత్రంలో రోజుకు 2వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తాడు. ఆయనే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. సిర్పూర్ ప్రజలకు ఆయనంటే భరోసా. అతనికి ప్రజలే అండా. ఇప్పటివరకు సిర్పూర్ నియోజకవర్గంలో మూడు సార్లు విజయం సాధించిన ఘనత ఏవరికీ లేదు.

వచ్చే ఎన్నికల్లో నాలుగో సారి విజయం సాధించేందుకు ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. రెండేండ్లుగా నిత్యాన్నదానం ద్వారా రోజుకు 2 వేల మందికి భోజనాలు పెడుతున్నారు. ఇలా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను జిల్లావాసులతోపాటు రాష్ట్ర ప్రజలందరి మన్ననలు పొందుతున్నాయి.
కార్మికుడి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా..
కృష్ణవేణి-సూర్యనారాయణ దంపతుల కుమారుడైన కోనేరు కోనప్ప ఎస్పీఎంలో సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించారు. 1995లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి సిర్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఓటమి చెందారు. 2014లో బీఎస్పీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత బీఆర్ఎస్లోనికి మారారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేతోపాటు అధిష్టానం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి పదవి అప్పగించింది. ప్రస్తుతం మళ్లీ సిర్పూర్ బరిలో నాలుగోసారి నిలిచారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

