ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, అక్టోబర్ 28: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయగా ఇందులో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్‌ను పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
ఆయన స్థానంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.