నార్నూర్,అక్టోబర్ 21 : దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో మంగళవారం ఆదివాసులు గోవర్ధన్ గుట్టలపై గోమాతలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం తినిపించారు. గుస్సాడీలకు, పశు కాపరి, పశుపోషకులు నూతన వస్త్రాలతో పాటు కానుకలు అందించారు. ఒకరికి ఒకరు ఆ లింగనం చేసుకొని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు మెస్రం రూప్ దేవ్, ఇంద్రవెల్లి మార్కెట్ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఉప సర్పంచ్ రాయి సీడం రూప్ దేవ్, మెస్రం మోతిరామ్ పటేల్, కోటక్ నానాజీ, సీతారాం, పవన్ కుమార్, తానాజీ, భీం రావ్, శేఖర్ బాబు, నాందేవ్, రవి, రామేశ్వర్ తదితరులు ఉన్నారు.