సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన తిర్యాణి మండల సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
- ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్
- తిర్యాణి మండల సర్వసభ్య సమావేశానికి హాజరు
- వివిధ శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం
తిర్యాణి,జూన్ 7 : ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన తిర్యాణి మండల సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడు నెలలకోసారి నిర్వహించే సమావేశాల్లో వ్యక్తిగతంగా వాదించుకోకుండా పక్కన పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ విధులను దైవంగా భావించి ముందుకు సాగాలని కోరారు. ప్రస్తుతం అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో మండలాభివృద్ధికి పూర్తి సహకారం అందించాలన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పల్లెల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అంతర్గత రోడ్లు, వంతెన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఇదిలా ఉండగా అంతకుముందు విద్యుత్ శాఖ ఏఈ కవిత తమ నివేదిక చదువుతుండగా, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎలాంటి నష్టం వాటిల్లినా బాధ్యత వహించాలని సూచించారు. అనంతరం తిర్యాణి రేంజర్ శ్రీనివాస్ తమ ప్రగతి నివేదికలు చదివి వినిపిస్తుండగా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి కలగజేసుకొని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలతో రోడ్లు నిర్మిస్తుంటే అడ్డుకోవడం సరైంది కాదన్నారు. మారుమూల గ్రామాల్లో 21 రోడ్ల నిర్మాణాలకు ఐటీడీఏ, పీఆర్, ఆర్అండ్బీ, ఎంఎంఎస్ ద్వారా నిధులు మంజూరయ్యాయని, టెండర్లు సైతం పూర్తయినట్లు తెలిపారు. అనుమతుల పేరిట రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం వల్ల గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. త్రీఇైంక్లెన్ నుంచి సమ్మక్క గద్దెల వరకు రూ.8 లక్షలతో ప్యాచ్ వర్క్ పనులు జరుగుతుండగా, అడ్డుకోవడమేమిటని నిలదీశారు. వందేళ్ల చరిత్ర గలిగిన ప్రధాన రహదారిని అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అడ్డుకున్నట్లు ఎఫ్ఆర్వో నిర్లక్ష సమాధానం ఇవ్వడంపై మండిపడ్డారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్,వైస్ ఎంపీపీ కోవ పార్వతి,ఎంపీడీవో మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

