ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/ఆసిఫాబాద్ టౌన్, మార్చి 23 : జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్స్‌లో కుమ్రం భీం జాతీయ అవార్డు ప్రదానోత్సవాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసీ సాం స్కృతిక పరిషత్ సంయుక్తంగా 12 ఏళ్లుగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ అవార్డును అందిస్తుండగా, 2024 సంవత్సరానికిగాను సినీహీరో సాయికుమార్‌ను ఎంపిక చేశారు.
అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్వహణ కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి, విశిష్టాథితులుగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్ట ర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా, మాజీ మంత్రి, హాస్య నటుడు బాబు మోహన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, నటుడు రాజ్‌మోహన్, కుమ్రం భీం మనుమడు సోనేరావు, నిర్వహణ కమి టీ కో చైర్మన్ దండనాయకుల నాగబాల సురేశ్‌కుమార్, కన్వీనర్ అర్జు మాస్టర్, యువ నిర్మాత నక రాహుల్ యాదవ్ హాజరయ్యా రు.
అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు. మెమొంటో ఇచ్చారు. రూ. 50 వేల నగదు పురసారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ చైర్మన్ పార్థసారథి మాట్లాడుతూ కుమ్రం భీం పోరాటం స్ఫూర్తిదాయకమని, జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడి ఆదివాసుల ఆరాధ్య దైవం అయ్యారని కొనియాడారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పీవోగా పనిచేశానని, జిల్లాలో అనేక సహజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆదివాసుల సంస్కృతి గొప్పదని, దానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సినీ హీరో సాయికుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకున్నానని, ఇప్పుడు కుమ్రం భీం జాతీయ అవార్డు అందుకున్నందుకు అనందంగా ఉందన్నారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ కుమ్రంభీం పేరిట అవార్డులు అందజేయడం అభినందనీయమన్నా రు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కుమ్రం భీం పేరిట సినీ ప్రముఖులకు జాతీయ అవార్డులు అందించడం గిరిజన జాతికి గర్వ కారణమన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 55 శాతం అడవులు ఉన్నాయని, ఇకడ పర్యాటకంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్‌లు చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. మాజీ మంత్రి, హాస్య నటుడు బాబు మోహన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి మాట్లాడుతూ కళాకారుల సేవలను గుర్తించి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. శివారెడ్డి మిమిక్రీ ఆకట్టుకుంది.
సినీ నటుల రాక తో జిల్లా కేంద్రం సం దడిగా మారింది. అంతకుముందు జిల్లా కేంద్రంలోని అంకమరాజు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోవ లక్ష్మి తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సినీ ప్రముఖులను సన్మానించారు. మాజీ జ డ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పీ మల్లికార్జున్, నిర్వహణ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రామారావు, సాయిని రాజశేఖర్, రాధా కృష్ణాచారి, శేఖర్ ఉన్నారు.