చినుకు రాలదు చింత తీరదు
వానకాలం ప్రారంభమై నెల రోజులైనా వర్షాలు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఆ తర్వాత కురిసిన వానలకు రెండోసారి విత్తనాలు వేశారు.
- వాడిపోతున్న పత్తి, సోయ, కంది మొలకలు
- అడుగంటిన భూగర్భజలాలు
- ఆందోళనలో అన్నదాతలు
- వానల కోసం ఎదురుచూపులు
వానకాలం ప్రారంభమై నెల రోజులైనా వర్షాలు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఆ తర్వాత కురిసిన వానలకు రెండోసారి విత్తనాలు వేశారు. మొలకలు వచ్చాక వర్షాలు ముఖం చాటేయడంతో పత్తి, సోయా, కంది, మక్క మొలకలు వాడిపోతున్నాయి. మరో వారం రోజులు ఎండలు ఇలాగే కొడితే చేలన్నీ ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువులు నిండక ఆయకట్టు కింది దుక్కులు దున్నడం లేదు. వర్షాలపై ఆశతో ఆశతో అక్కడక్కడ నారుమడుల్లో వడ్లు చల్లినప్పటికీ మండుతున్న ఎండలకు నారు ఎదగడం లేదని, దిక్కుతోచని పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.
– ఉట్నూర్ రూరల్, జూలై 17
స్ప్రింక్లర్లే దిక్కు..
బోథ్, జూలై 17 : బోథ్ మండలంలో 12 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు. పత్తి, సోయా, కంది, మక్క, పంటల మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకోనడంతో వరుణ దేవుడి కరుణ కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడ నీటి వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో సోయా, పత్తి, మక్కా పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. సౌకర్యం లేని రైతులు వాన జాడ కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజులుగా ఆకాశం మేఘవృతమై మబ్బు పట్టి ఉన్నా చినుకు జాడ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి మొలకలు వాడిపోతున్నాయి
ఉట్నూర్రూరల్, జూలై 17 : నేను రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాను. వర్షాలు లేక పత్తి మొలకలు వాడిపోతున్నాయి. బోరు బావితో నీళ్లు పెడుదామంటే అరగంట కూడా మొటరు నడవడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కు తొచడం లేదు. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడకుంటే పంటలు ఎండిపోతాయి. ఆర్థిక భారం పెరిగి అప్పుల పాలు అవుతాము.
-లింగన్న, రైతు, గంగన్నపేట్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

