మిల్లర్లపై చర్యలేవీ..?
మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల్లులకు 43,096.792 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది.
- సీఎంఆర్‌ను గడువులోగా తిరిగి ఇవ్వని వైనం
- 21 మిల్లులు డిఫాల్టర్ అయితే.. చర్యలు తీసుకున్నది ఒక్కదానిపైనే..
- రెండేళ్లు కావస్తున్నా పట్టించుకోని అధికారులు
- 5,918 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లా.. మింగేసినట్లా..?
మంచిర్యాల, జూన్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల్లులకు 43,096.792 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు 23,123.668 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పెట్టారు. ఇంకా 5,918.259 మెట్రిక్ ధాన్యం ప్రభుత్వానికి బకాయిపడ్డారు. ఇప్పుడు ఈ ధాన్యం మిల్లుల్లోనే ఉందా.. లేకపోతే ప్రైవేట్ మార్కెట్లోకి తరలిపోయిందా అనేది తేలాల్సి ఉంది. సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు వాటితోనే వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ బియ్యాన్ని దొంగదారిలో ధర ఎక్కువగా ఉండే రాష్ర్టాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. మరికొందరు మిల్లర్లు మన ధాన్యాన్ని పక్క రాష్ట్రల్లో అమ్మేసి, అక్కడ తక్కువ ధరకు దొరికే బియ్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు వ్యాపారం చేస్తుంటే ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనల ప్రకారం మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఏడాదిలోగా తిరిగి ఇవ్వాలి. కానీ పలుమార్లు గడువును పెంచుకుంటూ.. మధ్యలో ఓ వానకాలం వెళ్లిపోయి.. మళ్లీ వానకాలం (దాదాపు రెండేళ్లు) వచ్చే వరకు మిల్లర్లకు సమయం ఇచ్చారు. ఇంత చేసినా మిల్లర్లు ధాన్యం తిరిగి ఇవ్వలేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందే నిబంధనల ప్రకారం ధాన్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు ఏదో హడావుడి చేస్తూ చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు మిల్లర్ల విషయంలో పక్షపాతం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మిల్లులపై చర్యలేవి?
జిల్లా డిఫాల్టరైన మిల్లులు 21 ఉంటే, ఒక్క మిల్లర్ (ఇందారంలోని శివసాయి మల్లిఖార్జున ట్రేడర్స్ యాజమాని)పైనే క్రిమినల్ కేసు పెట్టి వదిలేశారు. డిఫాల్టరైన అందరినీ వదిలేసి ఒక్కరిపైనే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మిల్లును తనిఖీ చేసినప్పుడు ధాన్యం స్టాక్ లేకపోవడంతో క్రిమినల్ కేసు నమోదు చేసిన అధికారులు.. మరి మిగిలిన మిల్లులను ఎందుకు తనిఖీ చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతున్నది. మిల్లుల్లో స్టాక్ పొజిషన్ ఏమిటో.. ఇంకా ఎందుకు నిగ్గు తేల్చడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లికార్జున ట్రేడర్స్‌కు వానకాలం సీజన్లో 1268.748 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, 257.941 మెట్రిక్ టన్నులు ఎఫ్‌సీఐకి పంపారు. ఇంకా 592.121 మెట్రిక్ టన్నులు బకాయి పడ్డారు. దీనికి 25 శాతం పెనాల్టీ కలుపుకోగా 740.151 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ మల్లికార్జున ట్రేడర్స్ కంటే కూడా ఇంకొన్ని మిల్లులు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి బకాయిపడ్డాయి. జిల్లాలోని దాదాపు 13 మిల్లులు అధిక ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరి వాటన్నింటిలో స్టాక్ పొజిషన్ ఏమిటి.. ధాన్యం ఉందా లేక మిల్లర్లు మింగేశారా.. అనేది తేలాల్సి ఉంది. కాగా డిఫాల్టర్ ఉన్న కొందరు మిల్లర్ల నుంచి సివిల్ సప్లయ్ అధికారులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అందుకే ఆ మిల్లుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని కొందరు మిల్లర్లే చెబుతున్నారు.
ఎక్కువ మొత్తంలో బకాయిలున్న మిల్లులు ఇవే..
జిల్లాలో మొత్తం 21 మిల్లులు డిఫాల్టర్లో ఉండగా, ఇందులో 13 మిల్లులు అధిక మొత్తంలో ప్రభుత్వానికి ధాన్యం బకాయి పడ్డాయి. బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ (టేకుమట్ల) 1371.452 మెట్రిక్ టన్నులు, నీలం బ్రదర్స్ మోడ్రన్ రైస్ మిల్లు 979.50 మెట్రిక్ టన్నులు, కనకమహాలక్ష్మి (కిష్టంపేట చెన్నూర్) 870.418, మల్లికార్జున ట్రేడర్స్ (ఇందారం) 740.151, దుర్గ ఇండస్ట్రీస్ 616.803, అన్నపూర్ణ ఆగ్రో మోడ్రన్ రైస్ మిల్ 546.326, శ్రీ వేంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ 460.802, వెంకటేశ్వర్ రైస్ మిల్ ఎంఎంఆర్ 422.145, లక్ష్మీనరసింహా రైస్ మిల్ (కలమడుగు) 330.709, వెంకటరమణ రైస్‌మిల్ (పెద్దంపేట) 306.094, మణికంఠ రైస్‌మిల్లు (తాళ్లపేట) 203.114 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం బకాయిలు ఉన్నాయి. అన్ని మిల్లులు బకాయి పడిన ధాన్యం 5918.259 మెట్రిక్ టన్నులకు 25 శాతం పెనాల్టీ కలిపితే 7379.824 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఆలస్యమైనందుకు ప్రభుత్వానికి ఇచ్చే ధాన్యం విలువ మీద 12శాతం వడ్డీ కలిపి సివిల్ సప్లయ్ శాఖ డిఫాల్డరైన మిల్లర్ల నుంచి రూ.42,48,386 వసూలు చేయనున్నది.
సీఎంఆర్ పెట్టకుంటే కేసులే
సీఎంఆర్ బియ్యం మిల్లులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. గడువులోగా బియ్యం ఇవ్వని కారణంగా 23 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ తీసుకుంటాం. మొత్తం 21 మిల్లుల్లో కొందరు పెనాల్టీతో సీఎంఆర్ ఇచ్చేందుకు అంగీకరించారు. చర్యలు తీసుకుంటున్నాం.. కేసులు పెడుతున్నాం అని తెలిసి కూడా ఇప్పటికీ ఎఫ్‌సీఐకి బియ్యం పంపకుండా ఉంటున్న మిల్లులను తనిఖీ చేస్తాం. ఆ మిల్లుల్లో ధాన్యం లేని పక్షంలో నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే ఓ మిల్లుపై చర్యలు తీసుకున్నాం. మిగిలిన మిల్లులను తనిఖీ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సీఎంఆర్ ఎవ్వరూ పెట్టకపోయినా వారిపై కేసులు పెడతాం. – సభావత్ మోతీలాల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

