సీసీసీ నస్పూర్, జూలై 11: ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలని మంచిర్యాల ఇన్చార్జి డీఎంహెచ్‌వో అనిత కోరారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువా రం నస్పూర్ పీహెచ్సీ నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ కుటుంబ నియంత్రణ అనేది అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఎంతో అవసరమని తెలిపారు. దేశం మరిం త అభివృద్ధి చెందడానికి జనాభాపై నియంత్రణ అవసరమని తెలిపారు.
ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తల వద్ద కుటుంబ నియంత్రణకు కండోమ్, గర్భనిరోధక ఇంజక్షన్, తదితర తాతాలిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 15 రోజులపాటు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నీరజ, అరుణ, సమత, విజయపూర్ణిమ, జిల్లా మాస్ మీడి యా అధికారి బుక వెంకటేశ్వర్, దామోదర్, ప్రశాంతి, శివకుమార్, రాఘవయ్య, రాజేశ్వర్, వెంకటేశ్వర్లు, ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంచిర్యా ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇన్చార్జి డీఎంహెచ్‌వో అనిత వైద్య సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో ఉత్తమ సర్జన్‌గా అరుణశ్రీ, ఉత్తమ ఏఎన్ఎం రాజేశ్వరి వేమనపల్లి ఆరోగ్యకేంద్రం, ఉత్తమ సూపర్వైజర్గా మార్త, వెంకట్రావ్‌పేట్ పీహెచ్సీ, ఉత్త మ ఆశ కార్యకర్త డీ కవిత జైపూర్ పీహెచ్‌సీకి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇక్కడ డెమో వెంకటేశ్వర్లు, ఎస్వో దామోద ర్, రాజేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, మూర్తి, రత్నమాల, ప్రశాంతి, సిబ్బంది పాల్గొన్నారు.