ఖానాపూర్, అక్టోబర్ 6 : రెండోవార్డు శివాజీ నగర్కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరెలను మహిళలకు కౌన్సిలర్ కారిం గుల సంకీర్తనతో కలిసి చైర్మన్ అంకం రాజేందర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఉంటూ ప్రతి యేటా బతుకమ్మ పండుగకు చీరెలను అందిస్తున్నదని చైర్మన్ పేర్కొన్నారు. పీసీఎస్ వైస్ చైర్మన్ కరిపె శ్రీనివాస్, కారింగుల సుమన్, మహిళలు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 6 : పలు గ్రామాలతో పాటు (ఆర్) బావపూర్లో మహిళల కు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ప్రతి మహిళా బతుకమ్మ చీరెలను అందుకోవాలని సర్పంచ్ ఎరకేరి మల్లేశ్ తెలిపారు. గ్రామ మహిళ లు, తదితరులు పాల్గోన్నారు.
దస్తురాబాద్, అక్టోబర్ 6 : బుట్టాపూర్, మున్యాల, భూత్కూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరెల పంపిణీ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. ఎంపీటీసీ దుర్గం సునీతా రాజ లిం గం, సర్పంచ్లు బాదం నిరోష లక్ష్మీ రాజం, మారాజు పోశవ్వ సత్తన్న, దుర్గం శంకర్, పంచా యతీ కార్యదర్శులు, వీవోఏలు సురేశ్, కవిత, బీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షు రాలు జయలక్ష్మి, అంజలి,నాయకులు, మహి ళలు, తదితరులు పాల్గొన్నారు.