నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు,23: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్ట ర్ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు, బీడీ టేకేదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పింఛన్లను మంత్రి కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చై ర్మన్ ధర్మాజీ రాజేందర్, అధికారులు ఉన్నారు.