తిరుగు ప్రయాణంలో ప్రమాదం
శివకుమార్ వర్మ, శివ, అరుణ్, సాయిరెడ్డి స్నేహితులు. సరదాగా గోవా టూర్‌కు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు.
- గోవా టూర్‌కు వెళ్లి వస్తుండగా లారీని ఢీకొన్న కారు
- ప్రమాదస్థలంలోనే ఒకరి మృతి.. మరో ముగ్గురికి గాయాలు..
- వద్దన్నా ఆగకుండా పయనమై అనంత లోకాలకు..
నిర్మల్ అర్బన్, జూలై 16 : శివకుమార్ వర్మ, శివ, అరుణ్, సాయిరెడ్డి స్నేహితులు. సరదాగా గోవా టూర్‌కు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ క్రమంలో నాలు గు రోజుల క్రితం నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మల్‌కు చెందిన తన స్నేహితులైన శివ, అరుణ్, సాయిరెడ్డిలతో కలిసి వెళ్లారు. వీరిలో చింతకుంటవాడ కాలనీకి చెందిన బ్రహ్మరౌతు శివకుమార్ వర్మ(34), అతని భార్య రవళి, వీరి కుమారుడు, కుమార్తెతో కలిసి హైదరాబాద్ వరకు వెళ్లి అక్కడ బంధువులు(బామర్ధి) వాళ్ల ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లల్ని ఉంచి స్నేహితులతో కలిసి గోవాకు బయలు దేరారు. మూడు రోజులు స్నేహితులతో సరదాగా గడిపి మంగళవారం ఉదయం 1.00 గంటలకు శంషాబాద్‌లో ఫ్లయిట్ దిగి భార్యపిల్లలను తమతోపాటు నిర్మల్‌కు తీసుకెళ్తామని బంధువుల ఇంటికి చేరుకున్నాడు. హైదరాబాద్‌లోని తన బంధువుల ఇంటి నుంచి ఉదయం 4.00 గంటలకు భార్య, ఇద్దరు పిల్లలు, ముగ్గురు స్నేహితులతో కలిసి నిర్మల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఎంహెచ్ 40-బీజీ 0577లారీని కారు ఢీకొట్టింది. కారు నడుపుతున్న శివ అక్కడిక్కడే మృతి చెందగా పక్కన కూర్చున్న భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. వెనక కూర్చున్న ముగ్గురు స్నేహితులకు తీవ్ర గాయాలు కాగా.. అందులో శివ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఆగి ఉంటే బతికి ఉండేవాడు
గోవా నుంచి తిరిగి వచ్చిన వారు ఉదయం హైదరాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి చేరుకున్నారు. నిర్మల్‌కు బయలు దేరుతామని బంధువులకు చెప్పడంతో ఒకరోజు ఉండి వెళ్లమని నచ్చజెప్పారు. అయినా వినకకుండా బయలుదేరారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులు చెప్పినట్లు విని అక్కడే ఉన్నట్లయితే బతికే వాడని వాపోయారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నిర్మల్‌లో విషాదం అలుముకున్నది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

