మంచిర్యాల టౌన్, జూలై 19 : ఈ నెల 21న మంగళవారం బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు రానున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం మం చిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షెట్టిపేటపేటలోని వాసవీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొంటారన్నారు. మే 6న ప్రభుత్వ నిర్లక్ష్యం తో లక్షెట్టిపేట మండలంలో మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు పా ర్టీ పరంగా ఆర్థిక సాయంగా అందజేస్తారని తెలిపారు.
21న జరిగే రైతు సదస్సుకు మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పు ల ఈశ్వర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌లతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, గో గుల రవీందర్‌రెడ్డి, అంకం నరేశ్, అ క్కూరి సుబ్బయ్య, జూపాక సుధీర్, ఎర్రం తిరుపతి, కాటం రాజు, సాగి వెంకటేశ్వరరావు, మొగిలి శ్రీనివాస్, పానగంటి సత్తయ్య, బండి రమేశ్, పడాల రవీందర్, పెంట ప్రదీప్ పాల్గొన్నారు.