భైంసాటౌన్, అక్టోబ 7 : టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందడంతో దేగాంలోని ఎమ్మెల్యే తన నివాసంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్వీట్లు తినిపించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధ్దిదారులకు రూ. 5 లక్షలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నర్సాపూర్ (జీ) మండలం గొల్లమాడ గ్రామంలో కురుమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు.
బీరప్ప మందిర నిర్మాణా నికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మె ల్యే త్వరలో నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సాపూర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ పాపెన్ రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు రెడ్డి, కురుమ సంఘం సభ్యులు మాస్కిరి పోతన్న, మ్యాతారి భోజన్న, కాల్వ పోతన్న, దేవేందర్, నల్లాల ఎర్రన్న, మ్యాతారి లక్ష్మణ్, ఒలికిరి లక్ష్మణ్, భోజన్న, సతీశ్, రాజు, మీర్జాపూర్ పీఏసీఎస్ డైరెక్టర్ చాకెటి లస్మన్న తదితరులు పాల్గొన్నారు.