భీంపూర్, నవంబర్ 19 : ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గుర్తు చేశారు. ఆదివారం భీంపూర్, గుంజాల గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందు ఆయన హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. జాదవ్ అనిల్, నాయకులకు కొలాం గిరిజనులు ప్రత్యేక దండారీ డప్పువాయిద్యాలు, నృత్యాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం సభలో ఆయన మాట్లాడారు. గుంజాల కొలాం రైతుల స్వాధీనంలో ఉన్న సాగు భూములకు పట్టాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. చనాకా కోర్ట బ్యారేజీకి సంబంధించిన పిప్పల్‌కోటి రిజర్వాయర్ సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు .
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. ఎంపీగా ఉన్న సోయం బాపురావు ఆదివాసీలకు చేసింది ఏమి లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇస్తున్న మోసపూరిత హామీలను నమ్మవద్దన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే గుంజాల గ్రామాన్ని బీఆర్ఎస్ సర్కారు కొత్త పంచాయతీ చేసి అభివృద్ధి చేసిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ గెలుపు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. డాక్టర్ వన్నెల అశోక్ మాట్లాడుతూ టికెట్ ఇస్తామని తనను మోసం చేసిన కాంగ్రెస్ సామాన్య గిరిజనులకు ఏమి చేస్తుందని వివరించారు. జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ గోండీ ,కొలామిలో బీఆర్ఎస్ పథకాలు వివరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ప్రతినిధి, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బక్కి గోవర్ధన్‌యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఏనుగు అశోక్‌రెడ్డి ,రైతు బంధు సమితి అధ్యక్షుడు అనిల్, సర్పంచ్‌లు ఆత్రం లలిత-పైకు, మడావి లింబాజీ, బాదర్, కేమ ప్రమీల, హనుమద్దాసు, కృష్ణ, ఎంపీటీసీలు, నాయకులు బక్కి సురేందర్‌యాదవ్, జహూర్అహ్మద్, నరేందర్‌యాదవ్, ధరమ్‌సింగ్, ముకుంద సంతోష్, ఎం కల్చాప్యాదవ్, గుండావార్ ప్రకాశ్, కపిల్, ఆకటి నరేందర్‌రెడ్డి, కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి ,శంకర్, మేకల స్వామి, వంశీ, శ్రీను, దేవన్న, టెకాం బోను, షేక్ అఫ్రోజ్, నితిన్, వినోద్, వివిధ గ్రామాల కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 19 : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని బోథ్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. ఆదివారం బీజేపీ పట్టణ యువ నాయకులు తూం సూర్యం, నాయకులు మండల కేంద్రంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జాదవ్ అనిల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.