నెన్నెల, జనవరి 5 : పత్తి చేతికి వచ్చే ముందు, ఏరిన పత్తిని నిల్వ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్రామాల్లో నిండుగా తెల్లబంగారం నిల్వలు దర్శనమిస్తున్నాయి.
ఇం డ్లు, ఇంటి సమీపంలో నిల్వ చేశారు. గతంలో పత్తి నిల్వలో సరైన అవగాహన లేక అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పత్తితో పాటు ఇండ్లు దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగాఉండాలని అధికారులు సూచిస్తున్నారు.