జీపీ భవనాలకు నిధులు మంజూరు చేయండి
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతి
చెన్నూర్, జూన్ 30: చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును గురువారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
చెన్నూర్ మండలంలోని అంగ్రాజుపల్లి, సుందరశాల, పొక్కూరు, సోమన్‌పల్లి, కోటపల్లి మండలంలోని అన్నారం, దేవులవాడ, మల్లంపేట, నాగంపేట, నక్కలపల్లి, పారుపల్లి, పుల్లగాం, ఆల్గాం, రాంపూర్, రొయ్యలపల్లి, షట్పల్లి, సిర్సా, భీమారం మండలంలోని ఆరెపల్లి, పోలంపల్లి, ఖాజీపల్లి, నర్సింగపూర్, జైపూర్ మండలంలోని నార్వ, వెంట్రావుపల్లి, మందమర్రి మండలంలోని పులిమడుగు, ఆదిల్‌పేట, బొక్కలగుట్ట గ్రామ పంచాయతీలకు శాశ్వత గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. నిధుల మంజూరుకు మంత్రి దయాకర్‌రావు సానుకూలంగా స్పందించారని విప్ సుమన్ తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు.
మంత్రి ఐకేరెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు
బోథ్, జూన్ 30 : ఇటలీ పర్యటనను ముగించుకుని వచ్చిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని గురువారం బోథ్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, నడిపెల్లి దివాకర్‌రావులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో కలిసి మొక్కను అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల విషయమై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

