కేసీఆర్ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ సాధ్యమైంది
ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సం కల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైదని కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్
- జిల్లా కేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సం కల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైదని కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో ఆదివాసుల చేసిన పోరాటం స్ఫూర్తికి అ ద్దం పట్టిందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టా న్ని ప్రగతి పథంలో నడిపించారని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వైఫల్యాలను మూటగట్టుకుందన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కోవ సాయినాథ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

