ఎదులాపురం, డిసెంబర్ 29 : షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్కు సంబంధించిన ఉపకార వేతనాలపై ఆయా ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న 143 పెండింగ్ దరఖాస్తులను జనవరి 6 లోగా అందించాలన్నారు.
ఆధార్ అతేంటెకేషన్ సమస్యలుంటే జిల్లా ఈ మేనేజర్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. అదే విధంగా 2022-23 ఆర్థిక సం వత్సరానికి సంబంధించి 1433 దరఖాస్తులు ఉ న్నాయని , వాటి హార్డ్ కాపీలను జనవరి10 లో గా సమర్పించాలని ఆదేశించారు. అంతేగాకుం డా ఆయా కళాశాలల్లో పెండింగ్ దరఖాస్తులను లెక్చరర్‌కు ట్యాగ్ చేయాలని సూచించారు. ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలపై ఆయా వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్షిస్తూ కొత్త రిజిస్ట్రేషన్లతో పాటు పెండింగ్ దరఖాస్తులను వెంటనే సమర్పించాలన్నారు. వసతి గృహాల సంక్షేమ అధికారులు తమ పరిధిలోని హాస్టళ్లను పర్యవేక్షించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం , విద్య అం దేలా చూడాలన్నారు.
వసతి గృహాల్లో రాష్ట్ర స్థాయి నుంచి విజిలెన్స్ టీమ్‌లు హాసళ్ల పరిశీలనకు రానున్నట్లు తెలిపారు. భోజనం ఫొటోలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ట్యూటర్ల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అనంతరం డీఎస్సీడీవో భగత్ సునీత కుమారి మాట్లాడుతూ ఉపకారవేతనాలకు సంబంధించిన ఆధార్ అతేంటికేషన్ సమస్యలు ఉన్నాయని, కళాశాల, పాఠశాల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి దరఖాస్తులను ఫార్వర్డ్ చేయడంతో పాటు హార్డ్ కాపీలు సమర్పించాలన్నారు. సమావేశంలో ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, జిల్లా ఈ మేనేజర్ రవికుమార్, డీఐఈవో రవీందర్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌డబ్ల్యూవోలు ఉన్నారు.
జిల్లా టీఎస్-ఐపాస్, టీ-ప్రైడ్ కింద అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది గత నెల నుంచి ఇప్పటివరకు టీఎస్-ఐపాస్ కింద రెండు పరిశ్రమలకు దరఖా స్తు రాగా, ఆయా శాఖల సిఫారసు మేరకు జిల్లా కమిటీ అనుమతి మంజూరు చేసిందని, అభ్యంతరాల కారణంగా మరొకటి తిరస్కరించామన్నారు. టీ-ఫ్రైడ్ ద్వారా రవాణా సెక్టర్ కింద రూ.3.68 లక్షల సబ్సిడి కింద మంజూరు చేశామని తెలిపా రు. స మావేశంలో ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, డీఐసీ జీఎం పద్మభూషణ్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డీఎస్సీడీవో భగత్ సునీత, వివి ధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.