AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
AEO Ramya | రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించ కుండా వ్యవసాయ శాఖ సూచనల మేరకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ విస్తీర్ణాధికారి రమ్య సూచించారు
కుభీర్ : రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించ కుండా వ్యవసాయ శాఖ సూచనల మేరకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు ( Fertilizer Management ) పాటించాలని వ్యవసాయ విస్తీర్ణాధికారి రమ్య ( Ramya ) సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఖేత్ బచావో అభియాన్ – 2026 (రబీ) కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా భూసార పరిరక్షణ, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, పంటలకు అవసరమైన ఎరువులను నేల పరీక్షల ఆధారంగా వినియోగించుకోవడం వంటి అంశాలను వివరించారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం, సేంద్రియ ఎరువుల వినియో గం, నీటి పొదుపు పద్ధతులు పాటించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నరసయ్య, ఉపసర్పంచ్ పట్టెపు పోశెట్టి, లంక సురేష్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

