ఎదులాపురం,సెప్టెంబర్4: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ల నియామకానికి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్లో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉండడంతో అభ్యర్థులు ఆయా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిం చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 4219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2718 మంది పరీక్ష రాశారు. 1501 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.