ముథోల్, జూన్, 6 : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. సోమవారం మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని విఠోలి తండా ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో మండలం నుంచి 14 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు. వీటిలో రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ అడిషన్ కలెక్టర్ హేమంత్ బోక్కడే, ఎంపీడీవో సురేశ్‌బాబు, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీవో అమీర్ ఖాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ విజేశ్ ఉన్నారు.
విద్యాభివృద్ధికి కృషి
విద్యాభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సోమవారం ముథోల్‌లో నూతనంగా నిర్మించిన సోషల్ వెల్ఫేర్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. పాఠశాలలో కిచెన్ లేదన్న విషయాన్ని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు, నాయకులు ఉన్నారు.