ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, నవంబర్ 4: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో దివంగత వ్యాయామ ఉపాధ్యాయుడు గడిగొప్పుల సదానందం జ్ఞాపకార్థం నిర్వహించిన 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ టోర్నీ విజేతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు నిలిచింది. సోమవారం ఫైనల్లో మహబూబ్‌నగర్‌తో హోరాహోరీగా పోటీలో 6 పాయింట్ల తేడాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విజయ జట్టు విజయకేతనం ఎగురవేసింది. రెండో స్థానంలో మహబూబ్ నగర్ జట్టు నిలిచింది. మూడు రోజుల పాటు క్రీడలు ఉత్సాహంగా కొనసాగాయి.
పట్టణ సీఐ రవీందర్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యామల పవన్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేశ్, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, గిరిజన క్రీడల అధికారి బండ మీనారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునారర్ అరవింద్ లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కడతల రాకేశ్, ఏసీఎంఓ ఉద్ధవ్, పాఠశాల ఎచ్.ఎం జంగు,కోచ్ లు విద్యాసాగర్,రవి తిరుమల్ పీడీ విశాల, పీఈటీలు రాజలింగు, కల్యాణ్, సాయి, రమేశ్, కాంగ్రెస్ నాయకులు గుండ శ్యామ్, ముసడే చరణ్, సీనియర్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.