జన్నారం, జూన్ 14 : మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో రోజూవారి టార్గెట్‌ను కచ్చితంగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపూర్, రేండ్లగూడ, ధర్మారం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన మిషన్ భగీరథ ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సర్వేలో కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సింగిడి రమేశ్, కార్యదర్శులు గోపిచంద్ నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ధర్మారంలోని యూపీఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ శుక్రవారం అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు కిష్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో మేథా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను పరిశీలించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యనందించాలన్నారు. ఎంఈవో నడిమెట్ల విజయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న, తుంగూరి గోపాల్, సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దముక కమలాకర్, ప్రకాశ్ పాల్గొన్నారు.