ఎదులాపురం, ఫిబ్రవరి12: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ఆదివారం ఆందోళన చేపట్టారు. భుక్తాపూర్ మహాప్రజ్ఞ బుద్ధ విహార్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో హమారా ప్రసాద్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ముందుగా బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు రత్నజాడే ప్రజ్ఞాకుమార్ మాట్లాడారు. హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రత్నజాడే ఉదయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు తాగేపూజ, డొంగ్రే గీత, సుఖదేవ్, అర్చన, సంగీతబోరేకార్, దీప, సునీత, వైశాలి,ఆర్పిత, రాహుల్, హరీశ్ ఆకాశ్ ఉన్నారు.
మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ చౌరస్తా వద్ద హమారా ప్రసాద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కలెక్టర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేసి హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం జిల్లా, అధ్యక్షప్రధాన కార్యదర్శులు అల్లూరి భూమన్న, బాబన్న మాట్లాడారు. ఇలాంటి సంఘటలు పునరావృతం కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు కాడె స్వామి, అర్షా దేవిదాస్, శశికాంత్, సాయిబాబా, సూర్యవరప్రసాద్, సత్యనారాయణ, గుమ్మడి సురేశ్, ప్రసాద్, కిరణ్, రమేశ్, చంద్రకాంత్ పాల్గొన్నారు.