మిల్కీ బ్యూటీ తమన్నాలో చాలా టాలెంట్ ఉంది. అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్గాను ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది తమన్నా. ఈ అమ్మడు హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతుంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించిన తమన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్, బుల్లితెర షోస్ కూడా చేస్తుంది.
తమన్నా చేసిన ‘ఆహా’లో వచ్చిన ‘ది లెవంత్ అవర్’, ఆ తర్వాత ‘హాట్‌స్టార్’లో వచ్చిన ‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌లు మంచి సక్సెస్ సాధించాయి.ప్రస్తుతం మరో వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధంగా ఉంది తమన్నా. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తమన్నా తాజాగా ‘కిస్ మీ మోర్’ అనే పాటకు తన స్నేహితురాలు షాజియా శంజీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని తమన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘చెత్తని కట్ చేసేయాలి’ అంటూ ఈ వీడియోకి ఆమె క్యాప్షన్ పెట్టింది. తమన్నా డ్యాన్స్‌ని చూసిన వారు ఆమెపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు.