Samantha | ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన సమంత.. కారవాన్ లైఫ్ అలా ముగిసిందన్నమాట!
Samantha
2/18
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది.
3/18
సమంత (Samantha) సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
4/18
మయోసైటిస్ (Myositis) అనే వ్యాధి బారిన పడిన సమంత.. దాని చికిత్స కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
5/18
ప్రస్తుతం సామ్ (Samantha) ‘ఖుషి’ (Kushi) సినిమాతో పాటు, సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.
6/18
ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
7/18
దీనికి బలం చేకూరుస్తూ మూడు రోజుల క్రితం సమంత (Samantha).. ‘కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పేర్కొంటూ అందరికీ షాక్ ఇచ్చింది.
8/18
తాజాగా మరో కొత్త అప్‌డేట్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఈరోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని తెలిపింది.
9/18
సెల్ఫీ ఫొటో షేర్ చేసిన సమంత (Samantha).. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు.
10/18
ఎందుకంటే ఈ రోజుతో ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్ పూర్తైంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
11/18
రాజ్-డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ (Citadel) ఇండియన్ వెర్షన్‌లో వరుణ్‌ధవన్ (Varun Dhawan), సమంత (Samantha) నటిస్తున్నారని తెలిసిందే.
12/18
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇది.
13/18
ఇక సామ్.. సిటాడెల్ (Citadel) తో పాటు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘ఖుషి’ (Kushi) చిత్రంలో నటిస్తోంది.
14/18
శివ (Shiva Nirvana) నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.