Samantha | కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతోనే జీవితంలోని కష్టాల్ని జయించగలిగానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత (Samantha). ( Photos : Instagram )
3/21
ఆమె టైటిల్ రోల్‌ను పోషించిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam) ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ( Photos : Instagram )
4/21
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకులు తీసుకున్న సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి సమంత (Samantha) ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ( Photos : Instagram )
5/21
ఆమె మాట్లాడుతూ ‘నా వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి గమనించిన వారు నేను స్వతంత్ర భావాలతో పెరిగిన బలమైన మహిళ అనుకుంటారు. ( Photos : Instagram )
6/21
కానీ వాస్తవంలో నాది సున్నితమైన హృదయం. కష్టాలకు చలించిపోతాను. విడాకులు తీసుకున్న సమయంలో చీకటి రోజుల్ని చూశా. ( Photos : Instagram )
7/21
మనసు స్థిమితంగా ఉండేది కాదు. ఏవో అర్థంలేని ఆలోచనలు చుట్టుముట్టేవి. ఈ కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కుతానని ప్రతి రోజూ అమ్మని అడిగేదాన్ని. ( Photos : Instagram )
8/21
అయితే కాలం అన్నింటికి పరిష్కారం చూపిస్తుంది. గతంతో పోల్చితే ఇప్పుడు మనసుకు కాస్త సాంత్వన దొరికింది. కష్టాల్ని దాటివస్తేనే మనలో ధైర్యం పెరుగుతుంది. ( Photos : Instagram )
9/21
ఏ కష్టమైనా శాశ్వతంగా ఉండిపోదనే నిజాన్ని తెలుసుకోవాలి. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన మానసిక స్థైర్యంతోనే త్వరగా కోలుకున్నా’ అని చెప్పింది. ( Photos : Instagram )