Parineeti Chopra | పెళ్లి పనుల్లో పరిణీతి బిజీబిజీ..
Parineeti Chopra
2/20
Parineeti Chopra | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
3/20
ఈ ఏడాది మే నెలలో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
4/20
ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
5/20
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ నెలలోనే (సెప్టెంబర్) రాఘవ్-పరిణీతిల పరిణయం ఉంటుంది.
6/20
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో వీరి వివాహం జరగనుంది.
7/20
పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకలు ఈనెల 17 నుంచే ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
8/20
‘పెళ్లి వేడుకకు సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. పెళ్లికి వచ్చే అతిథులు, వీఐపీల కోసం ఉదయ్ పూర్‌లో విలాసవంతమైన హోటళ్లను బుక్ చేశారు.
9/20
ఇది గ్రాండ్ పంజాబీ వెడ్డింగ్. ఈ వేడుక సెప్టెంబర్ 24న ముగుస్తుంది’ అని తెలిపాయి. హల్దీ, మెహందీ, సంగీత్ సహా వివాహాది కార్యక్రమాలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి.
10/20
పెళ్లి తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
11/20
ఈ పెళ్లికి 200 మందికిపైగా అతిథులు, 50 మందికిపైగా వీవీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం.
12/20
దీంతో వీవీఐపీ అతిథుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ అధికారులు అతిథుల కోసం బుక్ చేసిన హోటళ్లలో తనిఖీలు చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
13/20
రెండు నెలల క్రితమే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయ్‌పూర్ వెళ్లి హోటళ్లను పరిశీలించినట్లు తెలిసింది.
14/20
ఈ వివాహానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవాకాశం ఉంది.
15/20
పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.
16/20
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో ఈనెల 13వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
17/20
ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు.
18/20
కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చాలారోజులు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట..
19/20
ఓ హోటల్ డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి.
20/20
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి..