HomeActorsTottempudi Gopichand At Rambanam Movie Interview Photos
Tottempudi Gopichand | ఆ కథ విన్నప్పుడే ఓ ప్రేక్షకుడిలా సినిమాలోని ఎమోషన్స్‌తో కనెక్ట్ అయ్యా : గోపీచంద్
Tottempudi Gopichand
2/18
Tottempudi Gopichand | ‘ఈ సినిమా కథలో అన్నదమ్ముల అనుబంధం తాలూకు భావోద్వేగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
3/18
రచయిత భూపతిరాజా కథ చెప్పినప్పుడు అందులో పూర్తిగా లీనమైపోయాను’ అన్నారు అగ్ర కథానాయకుడు గోపీచంద్ (Gopichand).
4/18
ఆయన నటించిన తాజా చిత్రం ‘రామబాణం’ (Rama Banam). శ్రీవాస్ దర్శకుడు (Sriwass). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
5/18
నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం గోపీచంద్ (Gopichand) పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
6/18
నేను గత కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తున్నా. కుటుంబ కథా చిత్రంలో నటించి చాలా రోజులైంది.
7/18
దర్శకుడు శ్రీవాస్ (Sriwass) కాంబినేషన్లో మూడో చిత్రమిది. మేమిద్దరం గతంలో చేసిన లక్ష్యం, లౌక్యం తరహాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలబోతగా ఆకట్టుకుంటుంది.
8/18
అయితే కథాపరంగా ఆ రెండు సినిమాలతో ఎలాంటి పోలిక ఉండదు. ఈ చిత్రానికి ‘రామబాణం’ (Rama Banam) అనే టైటిల్‌ను బాలకృష్ణ (Balakrishna)గారు సూచించారు.
9/18
జగపతిబాబుతో (Jagapathi Babu) నాకిది రెండో చిత్రం. ఆయన్ని కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే అనిపిస్తుంది. అందుకే ఆయన్ని నేను అన్నయ్య అని పిలుస్తుంటాను.
10/18
సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో బలమైన భావోద్వేగాలు పండాయి. ఇద్దరు అన్నదమ్ముల వ్యక్తిత్వాలు ఒకటే కానీ..వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరుగా ఉంటాయి.
11/18
ఈ నేపథ్యంలో జరిగే సంఘర్షణ కథలో కీలకంగా ఉంటుంది. వాణిజ్య పంథాలో సందేశాన్ని అందిస్తున్నాం.
12/18
కాలాలు మారినా కుటుంబ అనుబంధాలు మాత్రం అలాగే ఉంటాయి. కొత్త తరం వాళ్లు మమ్మీ, డాడీ, బ్రదర్ అని పిలుస్తున్నారు.
13/18
అయితే పిలుపులే మారాయి కానీ అనుబంధాల్లోని ఆర్థ్రత, భావోద్వేగాలు ఏమాత్రం మారలేదని నేను బలంగా విశ్వసిస్తాను.
14/18
మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు. ఒకవేళ సినిమా సక్సెస్ కాలేదంటే ప్రేక్షకులు నచ్చేలా తీయలేదని అర్థం చేసుకోవాలి. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు.
15/18
థియేటర్లో సినిమాలకు లాంగ్న్ ఉండాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ దక్కాలి. విడుదలైన రెండో రోజు నుంచి సినిమాను నడిపించేది కుటుంబ ప్రేక్షకులే.
16/18
ఈ కథ విన్నప్పుడే ఓ ప్రేక్షకుడిలా సినిమాలోని ఎమోషన్స్‌తో కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్..ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరాయి.
17/18
నా కెరీర్లో ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలు చేశాను. కథ నచ్చితే భవిష్యత్తులో కూడా న్యూ డైరెక్టర్స్‌కు అవకాశమిస్తాను.
18/18
కెరీర్ ఆరంభంలో నన్ను నిలబెట్టింది విలన్ పాత్రలే. శక్తివంతమైన విలన్ రోల్స్ వస్తే ఏ హీరో సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నా.