Naga Chaitanya
Naga Chaitanya | ప్రతి సినిమాకు వైవిధ్యతను చూపే కథానాయకుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఆయన నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ (Custody).
వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య (Naga Chaitanya) పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
ప్రతి సినిమాకు నేను రెండు నెలల వర్క్‌షాప్ చేస్తాను. క్యారెక్టర్ మీద అవగాహన కోసం కథలోని కొన్ని సీన్స్‌ను 5డి కెమెరాతో షూట్ చేయిస్తా.
ఈ సినిమా కోసం కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను కలిశాను. వారి కష్టాలు విన్నాక, తప్పకుండా ఈ సినిమా చేయా లనుకున్నా.
నాకు విజయంపై మరింత నమ్మకం పెరిగింది. అయితే ఆడియన్స్ తీర్పే ఫైనల్. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటా.
‘కస్టడీ’ (Custody) కథ చాలా కొత్తగా ఉంటుంది. వెంకట్‌ప్రభు (Venkat Prabhu) నాకు కథగా ఏమి చెప్పారో అదే తీశారు.
ఇటీవల ఆర్.ఆర్ అన్నీ పూర్తికాగానే థియేటర్‌లో సినిమా చూశాను. మంచి సినిమా ఇవ్వబోతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చింది.
యాక్షన్ సన్నివేశాలు చాలా నేచురల్‌గా ఉంటాయి. ఫైట్ మాస్టర్లతో రిహార్సల్ చేశాక షూట్‌కు వెళ్లాం. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్ వాటర్ వంటి సీన్స్‌వారితో చర్చించాక చేసినవే.
మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తారు. అందుకే యాక్షన్ పార్ట్‌ను జాగ్రత్తగా డిజైన్ చేశాం.
ఏ సినిమాను కస్టడీ (Custody)తో కంపేర్ చేయొద్దు. నేను ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నా. నా కెరీర్‌లో దిబెస్ట్ సినిమా అవుతుంది.
కూల్‌గా ఉండటం అనేది నా వ్యక్తిగతం. పాత్రను బట్టి నటుడు మారిపోవాలి. ఏ నటుడికైనా వర్క్‌షాప్ ఈ విషయంలో సహాయపడుతుంది. నాకు కూడా ఉపయోగపడింది.
Naga Chaitanya At Custody Movie Interviews Photos