హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో నిందితుడైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం బెయిలు మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల ఎస్‌హెచ్‌వో ముందు హాజరుకావాలని చెప్పింది.
భుజంగరావు బెయిల్ పొడిగింపు
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ కే సుజన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో బెయిల్ కోసం మరో నిందితుడు రాధాకిషన్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.