చర్మం తేమను కోల్పోకుండా రక్షిస్తుంది కలబంద. అయితే ఇప్పుడు ఆకుపచ్చ కలబంద స్థానంలో గులాబీ కలబంద (పింక్ అలోవిరా)ను ఉపయోగిస్తున్నారు చాలామంది. దీనికి అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. గులాబీ కలబంద జెల్లో యాంటీ ఆక్సిడెంట్స్, శరీరాన్ని చురుగ్గా ఉంచే పదార్థాలు అనేకం. గులాబీ కలబంద చర్మంపై ముడతలను, మొటిమలను తగ్గిస్తుంది. చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోయి కణాలకు పోషణనిచ్చి.. ఆరోగ్యంగా, కాంతి మంతంగా ఉండేలా చేస్తుంది. ఈ మొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అంతేకాదు, గులాబీ కలబంద కేశాల ఆరోగ్యానికీ దోహదపడుతుంది. చుండ్రును నివారించి, మాడును కండిషనింగ్ చేస్తుంది. గతంలో దక్షిణ కొరియాలో మాత్రమే లభించేది ఈ కలబంద. ఇప్పుడు భారతదేశంలోనూ అందుబాటులో ఉంది.