పుట్టినరోజు, పెళ్లిరోజు, మాతృదినోత్సవం, పితృదినోత్సవం, స్నేహితుల దినోత్సవం.. ఏ బంధాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికైనా ఓ బహుమతి కావాలి. అందులోనూ ఇది ఎకోఫ్రెండ్లీ యుగం. ప్రకృతిని ప్రేమిస్తూ, పచ్చదనాన్ని ఇష్టపడేవారికోసం సరికొత్త కుండీలు వచ్చేశాయి. గాజుసీసాతో తయారు చేసే ఈ చిట్టి కుండీల్లో చిన్నచిన్న మొక్కలను పెట్టుకోవడమే కాదు,ఆ బంధానికి గుర్తుగా ఫొటోలనూ జతచేస్తారు. ‘పర్సనలైజ్డ్ ఫ్రోజన్ బాటిల్ ప్లాంట్’ పేరుతో అందుబాటులో ఉన్న ఈ కుండీలలో లక్కీ బ్యాంబూ, జేడ్ ప్ల్లాంట్, డాలర్ ప్ల్లాంట్, ఫ్రెండ్షిప్ ప్ల్లాంట్ వంటి చిన్నచిన్న మొక్కలను పెట్టుకోవచ్చు. ఆఫీస్ టేబుల్, టీపాయ్, డైనింగ్ టేబుల్.. ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. తక్కువ స్థలం సరిపోతుంది. తక్కువ నీటితో బతికేస్తాయి.