శుభకార్యాలకు ఇంటిని అందంగా అలంకరించుకుంటాం. ఆత్మీయులకు ఉన్నంతలో విందు భోజనాలు ఏర్పాటుచేస్తాం. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మన అభిరుచిని అతిథులకు తెలియజేసేందుకు ‘ప్లేటెడ్ ప్రాజెక్ట్’ విభిన్న ఉత్పత్తులను అందిస్తున్నది. పళ్లాలపై మన సంప్రదాయ చిత్రాలను డిజిటల్‌గా ప్రింట్ చేయిస్తున్నది. భారతీయ వారసత్వ కళలకు ప్రచారం కల్పించాలన్నది ‘ప్లేటెడ్ ప్రాజెక్ట్’ లక్ష్యం. గోండు కళారూపాలు, మధుబని ఆర్ట్‌ను కూడా ఇందుకు ఉపయోగిస్తున్నది. వీటిని డైనింగ్ టేబిల్ మీద పెడితే.. ఓ కొత్త అలంకరణలా ఉంటుంది. హాల్లో ఫొటో ఫ్రేముల్లా వేలాడదీసుకోవచ్చు. ఒక్కో ప్లేట్ ఖరీదు రూ.2 వేల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఒక ప్లేట్ కొనుగోలు చేయడం ద్వారా 10 మంది కళాకారుల ఆకలి తీరుస్తారు.