ప్రకృతి ప్రేమికులకు మొక్కలన్నా, కలప వస్తువులన్నా ఎనలేని ప్రేమ. అలాంటి వారికోసమే ఓ వినూత్న వస్తువును ఆవిష్కరించింది ‘ఇండీజస్’. ఫర్నిచర్, ఫ్లోరింగ్‌లో వాడే చెక్కలను పేర్చి మొక్కల కుండీలను తయారు చేసిందీ సంస్థ. గోడ కోసం ఇటుకలు పేర్చినట్టు చెక్క ముక్కలను అందంగా కూర్చి, చిన్నచిన్న స్టీలు మేకులతో బిగించి రూపొందించింది. ప్రత్యేక నిర్మాణ నైపుణ్యం కారణంగా ఎంతపెద్ద మొక్కలనైనా వీటిలో నాటుకోవచ్చు. ఈ కుండీలు సున్నితమైన ఫినిషింగ్, వార్నిషింగ్తో ఆకర్షిస్తున్నాయి. ఇండ్లు, కార్యాలయాల్లో ఇండోర్ గార్డెన్లు పెంచాలనుకునేవారికి చక్కటి ఎంపిక. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కాకపోతే, ఖరీదైన వ్యవహారం.