ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
జీవనశైలి వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం.. ఇలా అనేకానేక సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్త్రీలు తరచూ చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు
జీవనశైలి వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం.. ఇలా అనేకానేక సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్త్రీలు తరచూ చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఏమైనా ఉన్నాయా?
– భట్టా సుధా మాధురి, ఉప్పల్
దురదృష్టవశాత్తు, చాలా కుటుంబాలు మహిళల ఆరోగ్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు-
పెండ్లిళ్లు, ఆర్థిక అవసరాలు, సొంతిల్లు.. ఇలాంటి అనేకానేక విషయాల తర్వాత ఎక్కడో చిట్టచివరన ఉంటుంది గృహిణి ఆరోగ్యం. ఆమెకు ఏదైనా సమస్య వస్తే.. వైద్యానికి ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడతారు. భార్యగా, తల్లిగా.. భర్త గురించి, పిల్లల గురించి ఆమె ఎంతగానో ఆలోచిస్తుంది. వాళ్లు మాత్రం తమ తర్వాతే ఏదైనా అనే సంకుచిత ధోరణితో వ్యవహరిస్తారు. ఆర్థిక స్వేచ్ఛతోనే మహిళ ఆరోగ్య స్వేచ్ఛనూ సాధించగలదు. అదృష్టంకొద్దీ ప్రకృతి స్త్రీకి బాసటగా నిలుస్తున్నది. ఆమె శరీర వ్యవస్థలోనే సహజ రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇరవైలలో, ముప్పైలలో పోషకాహారలోపం, అనారోగ్యకర ఆహార అలవాట్లు తదితర జీవనశైలి సమస్యలు మినహా ఏ ఇబ్బందులూ ఉండవు. కుటుంబ చరిత్ర ఉంటే మాత్రం.. క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు తదితర సమస్యలకు సంబంధించి చిన్న వయసు నుంచే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. నలభై తర్వాత గుండె, ఊపిరితిత్తులు, ఛాతీ, గర్భాశయం మొదలైన భాగాలకు సంబంధించి ఏడాదికి
ఒకసారైనా పరీక్షలు చేయించాలి.
– డాక్టర్ కోన లక్ష్మీకుమారి
సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో
ఎంటరాలజిస్ట్, బేరియాట్రిక్
స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Cancer
- Health
- house wife
- Obesity
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

