Western look Printed Frocks | చీరలైనా, డ్రస్సులైనా రంగురంగుల పూలతో కొత్త అందం వస్తుంది. అందుకే మహిళలు ఫ్లోరల్ డిజైన్ల పట్ల అంత మక్కువ చూపుతారు. ఉల్లిపొర లాంటి తేలికైన షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై అందమైన పూల సొగసుతో రూపొందించిన వెస్ట్రన్ లుక్ ప్రింటెడ్ ఫ్రాక్స్ ఇవి..
బ్లాక్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. మొత్తం ఒకే ఫ్యాబ్రిక్ వాడారు. కాంట్రాస్ట్‌గా లైనింగ్కోసం బ్లాక్ కాటన్ జతచేశారు. బాటమ్ పార్ట్‌కు ప్రిల్స్ జతచేసి వేవ్లుక్ కోసం పైపింగ్ చేశారు. టాప్ పార్ట్‌లో వీ నెక్ ఇచ్చి, బెల్ట్‌లా డిజైన్ చేయడంతో ట్రెండీలుక్ వచ్చింది. హాఫ్ ఫీట్ హ్యాండ్స్ ఇచ్చి రౌండ్ కట్స్, డోరీలు జత
చేయడంతో హైలైట్ అయ్యింది.
తెలుపు రంగు జార్జెట్ ఫ్యాబ్రిక్‌పై మల్టీకలర్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. తెలుపు మీద కొట్టొచ్చేలా కనిపించేందుకు ఆరెంజ్, పర్పుల్, ఎల్లో కలర్స్ వాడారు. బాటమ్ పార్ట్‌ను వేరుచేస్తూ చిన్నపాటి ప్రిల్స్ జతచేశారు. బాడీపార్ట్లో బ్రాడ్ నెక్ ఇచ్చి మెడకు కట్టుకునేందుకు డోరీలు జత చేయడంతో స్టైలిష్ లుక్ వచ్చింది. మల్టీకలర్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో బెలూన్ హ్యాండ్స్ ఇచ్చి చివర్లో ఎలాస్టిక్ జోడించడం బావుంది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
“పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే వెస్ట్రన్లుక్ ఫ్రాక్స్నే ఇప్పుడు ట్రెండ్”