ఎముకలు బలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
శరీరంలోని అవయవాలను కాపాడటం, కండరాలు సాఫీగా పనిచేసేలా చూడటం, క్యాల్షియంను భద్రపరచడం.. ఎముకల ముఖ్య బాధ్యత.
శరీరంలోని అవయవాలను కాపాడటం, కండరాలు సాఫీగా పనిచేసేలా చూడటం, క్యాల్షియంను భద్రపరచడం.. ఎముకల ముఖ్య బాధ్యత. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయి. పాత ఎముకల్లోని మృతకణాలు నశిస్తాయి, కొత్తవి పుట్టుకొస్తాయి. ఇదో సహజమైన ప్రక్రియ. చిన్నపిల్లలు, యువకులలో ఇది వేగంగా జరుగుతుంది. మూడుపదుల వయసులో మనిషి ఎముకల సాంద్రత పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది. ఆ తర్వాత క్షీణిస్తూ పోతుంది. ఈ నేపథ్యంలో ఎముకల ఆరోగ్యానికి నిపుణుల సూచనలు..
విటమిన్-డి
ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్-డి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరం క్యాల్షియంను శోషించుకోవడానికి సహకరిస్తుంది. విటమిన్-డి కొరత ఉన్న పెద్దల్లో ఎముకల సాంద్రత కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. విటమిన్-డి తగినంత తీసుకునే వారితో పోలిస్తే, తీసుకోని వారిలో ఎముకల క్షీణత ఎక్కువ. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండలో గడపటం, చీజ్, కాలేయం, కొవ్వులు ఎక్కువగా ఉన్న చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్-డి నిల్వలను పెంచుకోవచ్చు.
వ్యాయామం
ఎముకలు బలంగా ఉండాలంటే.. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం లాంటివి ఇందుకు దోహదపడతాయి. ఈ వ్యాయామాలు ఎముకల కణాల పెరుగుదలకు సాయపడతాయి. కానీ, ఈ విషయంలో నిపుణుల సలహా తప్పనిసరి.
ఆరోగ్యకర జీవనశైలి
పోషకాలతో కూడిన సమతులాహారం, ఆరోగ్యకరమైన బరువు ఎముకల బలోపేతానికి ఉపకరిస్తాయి. ఒంటి బరువు ఎక్కువైనా, మరీ తగ్గిపోయినా ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు చుట్టుముట్టవచ్చు. బరువు తక్కువ ఉన్నవారికి ఆస్టియోపొరోసిస్ (ఎముకలు గుల్లబారడం) ముప్పు ఉంటుంది. బరువు ఎక్కువగా ఉంటే ఎముకలు పెళుసుబారిపోవచ్చు.
సమతుల ఆహారం
విటమిన్-సి, ప్రొటీన్లు, క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారంతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విటమిన్-సిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అది ఎముకల తయారీకి ఉపకరించే కణజాల ఉత్పత్తిని క్రియాశీలం చేస్తుంది. ఉన్న ఎముకలు క్షీణించకుండా చూస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం, కూరగాయలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆహారంలో ప్రొటీన్లు కనుక తక్కువగా ఉంటే.. ఎముకలు క్యాల్షియంను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. దాంతో ఎముక ఏర్పడటం మీద దుష్ప్రభావం పడుతుంది. అదే ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుంది. అందుకని డాక్టర్ సూచించిన మొత్తంలోనే ప్రొటీన్లు తీసుకోవాలి. క్యాల్షియం సమృద్ధమైన ఆహారం వల్ల ఎముకల మృతకణాలు తొలగిపోయి, కొత్తవి వేగంగా ఏర్పడతాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన డైట్‌తో, క్రమం తప్పని వ్యాయామంతో తమను తాము శక్తిమంతం చేసుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

