ప్రేమికుల పండుగ వచ్చేసింది. ఇది పాశ్చాత్య సంప్రదాయమైనా క్రమంగా స్థానిక అలవాట్లనూ జోడిస్తున్నారు. తమదైన శైలిలో ‘వాలెంటైన్స్ డే’ జరుపుకొంటున్నారు. అలాంటి కొన్ని ఆచారాలు..
‘లాటరీ డి ఆమర్’ సంప్రదాయం అమలులో ఉంది. దీని ప్రకారం.. పెండ్లికాని వాళ్లంతా ఒక చోట చేరి నచ్చిన వారిని ఎంచుకుంటారు. ఫిబ్రవరి 14కు ముందు రకరకాల జాతరలూ జరుగుతాయి. ‘ట్రీ ఆఫ్ ఎటర్నల్ హార్ట్స్’ దగ్గర ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, తమ బంధం బలపడాలంటూ ‘ట్రీ ఆఫ్ ఓస్’ చెట్టుకు దారాలు కట్టడం.. అందులో కొన్ని.
వాలెంటైన్స్ డే రోజు, ప్రేమ విజేతలు సామూహిక వివాహాలు చేసుకుంటారు. ప్రేమికులైతే సంగీతకారులను, గాయకులను వెంటబెట్టుకుని… ప్రేయసి ముందు తమ ప్రేమను వెల్లడించేందుకు బయల్దేరతారు. ఈ వేడుకను ‘సెరనేడింగ్’ అంటారు.
ప్రేమికులే కాదు, ఎవరైనా ఎవరికైనా కించిత్ భావుకతతో ఉత్తరాలు, కవితలు రాసి.. రహస్యంగా పంపే ‘గకెబ్రేవ్’ అనే విచిత్రమైన ఆచారం ఉంది. అవతలి వ్యక్తి తమకు అందిన ఉత్తరం, కవిత ఎవరు రాశారో కచ్చితంగా అంచనా వేస్తే.. చక్కని బహుమతి కూడా ఉంటుంది.
ప్రేమ దేవత జునోను తలుచుకుంటారు. ఆ తల్లి దయవల్ల తమ బంధం స్థిరపడాలని వేడుకుంటారు.
ఈ రోజు కాబోయే ప్రేమికులను దగ్గర చేసే అద్భుతమేదో జరుగుతుందని నమ్మకం. కొవ్వొత్తి చేత పట్టుకుని, అద్దం ముందు నిలబడి.. తమ కాబోయే భాగస్వామి ప్రతిబింబం అందులో కనిపిస్తుందేమో అని వెతుకుతారు.
వాలెంటైన్స్ డే మరునాడు ‘లుపెర్సాలియా’ అనే పండుగ జరుగుతుంది. ఆ రోజు తమకు ఇష్టమైన వ్యక్తి పేరును ఒక కాగితం మీద రాసి, చొక్కాలకు గుచ్చుకుని తిరుగుతారు.