ఫోన్ రోజూ వాడేదే. అదే అదే పదే పదే ఏం వాడతాం అని బోర్ కొట్టినా, మాటి మాటికీ దాన్ని మార్చలేం. అందుకే ఫోన్ కేస్ని డిఫరెంట్గా ట్రై చేస్తే ఇటు ట్రెండు అటు బడ్జెట్ ఫ్రెండు. అలాంటి వెరైటీ కావాలని ప్రయత్నిస్తున్న వాళ్ల కోసమే తయారవుతున్నాయి ‘త్రీడీ ఫుడ్ ఫోన్ కేస్’లు. ఫోన్ కేస్ వెనుక ఆమ్లెట్ వేసినట్టు, అన్నం కూరలు అమర్చినట్టు, మక్కకంకి గింజలు పరచినట్టు, అరటి పండు ఒలిచి పెట్టినట్టు కనిపిస్తుంటాయివి.
అంతేకాదు… ఐస్క్రీమ్, బ్రెడ్, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్లాంటి రూపాలెన్నో వీటిలో ఉంటాయి. ఇవన్నీ నిజమైన వాటిలాగా పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తాయి కూడా. మెత్తటి సిలికాన్తో వీటిని తయారు చేస్తారు కనుక, పట్టుకోవడం కూడా సులువే! ఫుడ్లవర్స్కి అయితే ఇవి మంచి ఆప్షన్. క్రేజీ రోజీలకు కూడా ఇవి తెగ నచ్చేస్తున్నాయి. మొత్తానికి వీటి వల్ల ఫోన్ కేస్ కాస్తా ఫుడ్ కేస్గా మారిందన్న మాట!