ఎవరమ్మా ఈ పూలకొమ్మ! ఏ ఊరిదమ్మా ఈ రబ్బరు బొమ్మ!.. అనిపించేలా ఉన్న ఈ మత్తుకళ్ల భామ పేరు.. పవిత్ర మరిముత్తు.తన ట్రిపుల్ టాపింగ్ గ్లామర్‌తో ‘పిజ్జా 3’ సినిమాలో కనువిందు చేయనున్నది.పూలరంగు మిడ్డీ.. మినిమలిస్టిక్ జువెలరీ, లిప్‌స్టిక్ పెదాలు, అరనవ్వు, నిండైన అందం… పవిత్ర ప్రత్యేకతలు. ఇక చెప్పేదేముంది? స్విగ్గీ ఆర్డర్లా సక్సెస్ ఆమె అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లడం ఖాయం.
సి.ఎం. ప్రవీణ్