Trinetra Haldar Gummaraju | బెంగళూరుకు చెందిన ఈ వైద్యురాలి పేరు త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు. ఇరవై ఏండ్లు వచ్చే వరకూ పురుషుడిగానే బతికింది. ఆ తర్వాత తన శరీరంలోని మార్పులకు తగినట్టు ట్రాన్స్ ఉమెన్‌గా అవతరించింది. వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే గుమ్మరాజు ‘వ్లాగర్’గా ఎంతోమందిని ఆకట్టుకున్నది. ఇప్పుడు అదే గొంతుకను తన సమూహం కోసం ఉపయోగిస్తున్నది. ట్రాన్స్ సమస్యలపై పోరాటం చేస్తున్నది డాక్టర్ త్రినేత్ర.
ఇప్పటి వరకూ క్వీర్, ట్రాన్స్ కమ్యూనిటీలకు సరైన వైద్యం అందడం లేదని గ్రహించి.. పూర్తిస్థాయి ట్రాన్స్ వైద్యురాలిగా మారింది. యూట్యూబ్ చానెల్ ద్వారా తమ కమ్యూనిటీకి వైద్య, చర్మ సంబంధమైన చిట్కాలు అందిస్తున్నది. కొత్త జీవితాన్ని ప్రేమించడం నేర్పుతున్నది. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నవారి కథలను సరికొత్తగా పరిచయం చేస్తున్నది.
“బెంగాల్ టైగర్, ఖడ్గమృగాలను చూస్తేనే పారిపోతాం.. ఈ సివంగులైతే వాటికే సెక్యూరిటీ”
“CR Lejumol | 47 ఏనుగులకు ఈమె సంరక్షకురాలు.. ఎలా సాధ్యమైందంటే..”