చలికాలం వచ్చిందంటే స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ పెదాల సమస్యలు మొదలవుతాయి. ఒక్కసారిగా పొడి బారడం, పగలడం ప్రారంభం అవుతుంది. పట్టించుకోకపోతే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే పెదాలు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటాయి. ముందుగా పొడిబారిన పెదాలను నాలుకతో తడపటం ఆపేయాలి. పెదాలపై తేమ తగ్గకుండా ఉండేందుకు తరచూ లిప్‌బామ్ రాసుకోవాలి. దానివల్ల పెదాలు మృదువుగా ఉండటమే కాదు, బయటికి వెళ్లినప్పుడు కాలుష్యం, సూర్యరశ్మి, పొడిగాలి నుంచి రక్షణ లభిస్తుంది. కాలేజీ, ఆఫీసులకు వెళ్లినా.. తప్పనిసరిగా లిప్ బామ్ బ్యాగ్‌లో వేసుకొని వెళ్లాలి. తరచూ పెదాలను చేతులతో తాకడం మానేయాలి. లేదంటే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు పెదాలపై చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పెదాలపై చర్మం పెచ్చులుగా ఊడుతున్నప్పుడు బలవంతంగా తొలగించ వద్దు. వారానికోసారి పెదాలపై తేనె, చక్కెర కలిపిన మిశ్రమంతో మర్దన చేయాలి. పెట్రోలియం జెల్లీతో కూడిన లిప్‌బామ్స్ వాడటం మంచిది.