మెటా మెచ్చిన.. తెలుగు మామ్స్!
ఫేస్బుక్ (మెటా) సంస్థ సామాజిక బాధ్యతగా ప్రపంచవ్యాప్తంగా ‘కమ్యూనిటీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్' నిర్వహిస్తుంది. దీనిద్వారా ఫేస్బుక్లో చురుగ్గా ఉండే కమ్యూనిటీలకు శిక్షణ ఇస్తుంది. నైపుణ్య వృద్ధిని ప్రోత్సహిస్తూ.. ఆర్థిక సహకారం కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షల కమ్యూనిటీలు దరఖాస్తు చేస్తాయి
ఫేస్బుక్ (మెటా) సంస్థ సామాజిక బాధ్యతగా ప్రపంచవ్యాప్తంగా ‘కమ్యూనిటీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తుంది. దీనిద్వారా ఫేస్బుక్లో చురుగ్గా ఉండే కమ్యూనిటీలకు శిక్షణ ఇస్తుంది. నైపుణ్య వృద్ధిని ప్రోత్సహిస్తూ.. ఆర్థిక సహకారం కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షల కమ్యూనిటీలు దరఖాస్తు చేస్తాయి. ఈసారి, మన దేశం నుంచి పదిహేను బృందాలు ఎంపికయ్యాయి. అందులో నంబర్ వన్‌గా నిలిచింది.. ‘తెలుగు మామ్స్ నెట్వర్క్’.
‘తెలుగుమామ్స్ నెట్వర్క్’ కమ్యూనిటీ పేజీ నాలుగేండ్ల క్రితం మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్తి దీన్ని ప్రారంభించారు. చుట్టుపక్కల మహిళలకు చేదోడుగా ఉండేందుకు ఆమె చేసిన చిరుప్రయత్నమిది. అయితేనేం, అతితక్కువ కాలంలోనే నలుమూలలకూ విస్తరించింది. తెలుగు మామ్స్ నెట్వర్క్ తన వేదిక మీద అనేక విషయాలను చర్చిస్తుంది. సామాజిక అంశాల పట్ల మహిళలకు అవగాహన కల్పిస్తుంది. నిరాశలో ఉన్నవారిని అక్కున చేర్చుకొని చేతనైన సాయం చేస్తుంది. ఈ బృందం అందించే ఉద్యోగ ప్రకటనలు, వ్యాపార ఆలోచనలు, వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఎంతోమందిని చైతన్యపరిచాయి. అమ్మల నెట్వర్క్ నేడు 27,400 మందిని చేరుకుంది. ఇన్ని వేలమంది సభ్యులను క్రియాశీలకంగా ఉంచడంలో ప్రదీప్తి పాత్ర చురుకైనది. కాబట్టే, సాక్షాత్తు ఫేస్బుక్ ఆ పనితనాన్ని గుర్తించింది.

‘ఫేస్బుక్ కమ్యూనిటీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్’కు ఎంపిక చేసింది. ఈ అవకాశం కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కమ్యూనిటీలు దరఖాస్తు చేశాయి. అందులో140 కమ్యూనిటీలను ఎంపిక చేశారు. వాటిలో పదిహేను భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించాయి. అందులో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.. తెలుగు మామ్స్ నెట్వర్క్. ‘ఫేస్బుక్ కమ్యూనిటీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్’లో భాగంగా నాలుగు నెలల పాటు బ్రాండింగ్, టూల్స్, మార్కెటింగ్ తదితర అంశాల్లో అడ్మిన్స్‌కు శిక్షణ ఇస్తారు. కొంత ఆర్థిక సాయమూ లభిస్తుంది. ఆ మొత్తాన్ని తమ కమ్యూనిటీ అభివృద్ధికి ఖర్చు చేసుకోవచ్చు. భారత్ నుంచి ఎంపికైన కమ్యూనిటీలకు హైదరాబాద్‌లోని ‘టీహబ్’ ద్వారా శిక్షణ ఇప్పించనున్నారు. ‘తెలుగు మామ్స్ నెట్‌వర్క్‌ను స్కిల్ డెవలప్మెంట్ కంపెనీగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. మా కమ్యూనిటీలోని ఆంత్రప్రెన్యూర్స్‌కు ఆర్థిక తోడ్పాటు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఓ ప్రాంతీయ భాష వేదికగా ఏర్పాటైన మా బృందానికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చిన మెటాకు కృతజ్ఞతలు’ అంటారు తెలుగు మామ్స్ నెట్వర్క్ అడ్మిన్ ప్రదీప్తి విస్సంశెట్టి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

