కొన్ని డ్రెస్సులు మరీ చిన్నవైతే అసహ్యంగా ఉంటుంది. మరీ పెద్దవైతే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం సరైన కొలతలతో మెరుపు లతలా తళుక్కుమంటున్నది. ‘నేనేం తక్కువ?’ అన్నట్టు జుట్టు కూడా కురచగా మారిపోయింది.
మెడలోని ముత్యాల హారమే కాస్త పెద్దరికాన్ని ఒలకబోస్తున్నది. చేతులకు వేసుకున్న టాటూలు రహస్యభాషలో చెలికానికి సంకేతాలు అందిస్తున్నాయి. చూపులు సైతం ‘రావోయి అనుకోని అతిథీ’ అంటూ అతడిని పిలువకనే పిలుస్తున్నాయి.